Shamita Shetty: శిల్పాశెట్టి సోదరి ఎమోషనల్ కామెంట్స్!

దేశవ్యాప్తంగా బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఆ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మరోపక్క కేవలం ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అవుతున్న కరణ్ జోహార్ బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లో ఒకరైన షమితా శెట్టి మొదటిసారి తన వ్యక్తిగత విషయాలను మరో కంటెస్టెంట్ తో పంచుకొని ఎమోషనల్ అయింది.

షమితా శెట్టి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి అనే విషయం తెలిసిందే. తన తోటి కంటెస్టెంట్ నేహాతో జరిగిన సంభాషణలో.. తన మొదటి బాయ్ ఫ్రెండ్ కారు ప్రమాసంలో మరణించాడని తెలిపింది. ఆ సమయంలో అతనితో తన అనుబంధాన్ని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది. అయితే వ్యక్తిగత విషయాల్లో ఎంతో గోప్యంగా ఉండే ఆమె ఇలాంటి విషయాలు పంచుకోవడం విశేషం. అంతరం రాకేష్ బాపత్ తో మరికొన్ని విషయాలు పంచుకుంది.

తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు గడిచిపోయాయని.. ఇప్పటివరకు అందరూ తనను శిల్పాశెట్టి సోదరిగానే గుర్తిస్తున్నారని.. ఆమె తనకు నీడలా ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.. తన గురించి జనాలకు నిజం తెలియదని చెప్పుకొచ్చింది. ఆ నీడ నుంచి బయటపడి ప్రత్యేక గుర్తింపును పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus