‘శంకర్‌దాదా’లో శ్రీరామచంద్రమూర్తి గుర్తున్నాడా?

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో శ్రీరామచంద్రమూర్తి అని ఓ కుర్రాడు ఉంటాడు గుర్తుందా? చిరంజీవి అభిమానులైతే ‘మాకెందుకు గుర్తు లేదు… హాస్పిటల్‌లో వీల్‌చైర్‌లో కనిపించిన కుర్రాడే కదా’ అంటారు. అదే మామూలు ప్రేక్షకులు అయితే ‘ఆ గుర్తున్నాడు’ అంటారు. ఆ కుర్రాడు ఇప్పుడు హీరో అయ్యాడని తెలుసా? అంతేకాదు హాట్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ప్రియుడిగా ఓ సినిమా నటిస్తున్నాడనీ తెలుసా? ఏంటీ తెలియదా? అయితే ఈ వార్త మీ కోసమే.

ఒకవేళ తెలిసుంటే.. ఎంచక్కా ఈ వార్త షేర్‌ చేసి తెలియనవాళ్లకు చెప్పేయండి.‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో అచేతనంగా కుర్చీలో కనిపించే కుర్రాడు శ్రీరామచంద్రమూర్తిని మరచిపోవడం ఎవరితరమూ కాదు. సినిమాలో సీరియస్‌నెస్‌ తెచ్చిన ఎలిమెంట్స్‌లో శ్రీరామచంద్రమూర్తి ఎపిసోడ్‌ ఒకటి. సినిమా ఆఖరులో అందరి మనసుల్ని బరువెక్కించే పాత్ర అది. ఆ పాత్రలో నటించిన కుర్రాడిని అప్పుడు చూసి… ఈ ముఖంలో ‘మెగా’ కళ కనిపిస్తోంది అని అనుకున్నారు. అయితే మెగాస్టార్‌ సినిమా కదా ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది అని వదిలేశారు.

అయితే ఆ పాత్రలో నటించి మెగా ఇంటి కుర్రాడే. అవును ‘ఉప్పెన’తో టాలీవుడ్‌కు పరిచయమవుతున్న వైష్ణవ్‌తేజే ఆ కుర్రాడు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ప్రియుడు అయ్యి ఆడిపాడేస్తున్నాడు కూడా.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus