హృతిక్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కించనున్న శంకర్..?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. జనవరి 18 నుండీ ఈ చిత్రం రెగ్యులర్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తరువాత శంకర్ మరో భారీ ప్రాజెక్టు కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఈ భారీ పోజెక్టు ఉండబోతోందట. మెల్ల మెల్లగా శంకర్ బాలీవుడ్ మార్కెట్ పై మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రజినీకాంత్ తో తెరకెక్కించిన ‘2.0’ చిత్రంలో అక్షయ్ కుమార్ ని ప్రధాన పాత్ర ఇచ్చి.. బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి మంచి కలెక్షన్లను రాబట్టుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మొదట అక్షయ్ కుమార్ పాత్ర కోసం హృతిక్ నే సంప్రదించాడట శంకర్. అయితే వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో… హృతిక్ రోషన్ మరో ప్రాజెక్టు చేద్దామని శంకర్ కి చెప్పాడట. ఈ క్రమంలో హృతిక్ రోషన్ ను దృష్టిలో పెట్టుకుని సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథను ఒకటి సిద్ధం చేసి తాజాగా హృతిక్ కు వినిపించినట్టు తెలుస్తోంది. హృతిక్ కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించడానికి చాలా మంది బడా నిర్మాతలు ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus