రోబో 2 .o సినిమాపై ఆసక్తి పెంచిన శంకర్

మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న శంకర్ మరో మారు అద్భుతాన్ని ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి రోబో 2 .o సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొత్తం త్రీడీ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు రోబో అమీ జాక్సన్, రోబో రజనీకాంత్ పై పాటను షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ విషయాన్నీ చెప్పారు.

రోబో 2 .o అనగానే ఇది రోబో సినిమాకి సీక్వెల్ అనుకుంటున్నారు.. అలా అనుకోవద్దని స్పష్టం చేశారు. ఈ మూవీ ది కొత్త కథని వివరించారు. దీంతో అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో విలన్ గా భయపెట్టనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలను ఈ నెల 27న దుబాయ్ లో రిలీజ్ చేయనున్నారు. మూవీ ట్రైలర్ ను డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న రోబో 2 .o వచ్చే ఏడాది జనవరిలో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus