RC15: శంకర్ చరణ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మారనుందా?

శంకర్ చరణ్ కాంబో మూవీ కోసం రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అయితే శంకర్ ఒకవైపు చరణ్ సినిమాను తెరకెక్కిస్తూనే మరోవైపు కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమాను తెరకెక్కిస్తుండటంతో శంకర్ చరణ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

శంకర్ మూవీ విషయంలో చరణ్ అభిమానులకు షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ సినిమాను పూర్తి చేసిన తర్వాత శంకర్ కమల్ హాసన్ సినిమాతో బిజీ అయ్యి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. శంకర్ నిర్ణయం వల్ల నిర్మాత దిల్ రాజుపై కూడా ఆర్థిక భారం పడే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని శంకర్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాల్సి ఉంది.

దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తమిళంలో కూడా శంకర్ కు ఊహించని స్థాయిలోక్రేజ్ ఉన్న నేపథ్యంలో చరణ్ కు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాతో గుర్తింపు మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చరణ్ ఈ సినిమాలతో పాటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఆ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందని తెలుస్తోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus