రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘ఇండియన్’ సినిమాకి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను మొదలుపెట్టినప్పటి నుండి తరచూ ఏదొక అవాంతరం కలుగుతూనే ఉంది. షూటింగ్ ఆరంభించి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా సినిమాను పూర్తి చేయలేదు. మధ్యలో దర్శకుడు శంకర్ కి, లైకా నిర్మాతలకు తేడాలు రావడంతో షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ తరువాత అయినా షూటింగ్ మొదలవుతుందనుకుంటే.. అది కూడా జరగలేదు.
పైగా శంకర్ తన తదుపరి సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో లైకా సంస్థ కోర్టుకెక్కింది. తమ సినిమా పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా చేయడానికి వీల్లేదంటూ కోర్టుకి విన్నవించింది. దీంతో ఇప్పుడు శంకర్ రాజీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై శంకర్ స్పందించనప్పటికీ.. ఆయనొక నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. లైకా సంస్థతో ఈ ఇష్యూని సెటిల్ చేసుకోవాలనుకుంటున్నాడు శంకర్. మిగిలిన షూటింగ్ ని రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
దాదాపు యాభై రోజుల పాటు షూటింగ్ ని నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కమల్ హాసన్ ఎలెక్షన్ కాంపెయిన్ పూర్తయిన వెంటనే షూటింగ్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టడానికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను జూలై లేదా ఆగస్టులో ప్రారంభించాలని అనుకున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!