Sharat Chandra: మహర్షి కథపై శరత్ చంద్ర షాకింగ్ కామెంట్స్.. కోర్టుకు వెళ్తానంటూ?

ఈ మధ్య కాలంలో కొరటాల శివపై క్రిమినల్ కేసుకు కారణమైన శ్రీమంతుడు కథ గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విల్సన్ అలియాస్ శరత్ చంద్ర రచయిత కాగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శరత్ చంద్ర శ్రీమంతుడే కాదు మహర్షి సినిమా కూడా కాపీ అంటూ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. భవిష్యత్తులో మహర్షి విషయంలో కూడా కోర్టుకు వెళ్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు.

శరత్ చంద్ర మాట్లాడుతూ నాది సమాహారం అనే కథ మహర్షి సినిమాగా వచ్చిందని మక్కీకి మక్కీ తీసుకున్నారని ఆయన తెలిపారు. సమాహారంలో స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకుందో తెలుసుకోవడానికి ఇండియాకు హీరో వస్తాడని మహర్షిలో నరేష్ కోసం హీరో ఇండియాకు వస్తాడని సినిమాలో, నవలలో ఫ్రెండ్ నాన్న పాత్ర రైతు అని ఆయన అన్నారు. నా కథలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి హీరో పెద్ద ఉద్యమం నడుపుతాడని శరత్ చంద్ర అన్నారు.

మహర్షి సినిమా విషయంలో కూడా కోర్టుకు వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. రైతుబంధు పథకానికి కూడా ఆ కథలో ఉన్న రైతునిధి స్కీమ్ స్పూర్తి అని శరత్ చంద్ర వెల్లడించారు. ఒక కథ వెనుక ఎంతో మేధో మధనం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఒక రచయితకు ప్రతి రచన ప్రసవ వేదన అని ఆయన పేర్కొన్నారు. శ్రీమంతుడు రైటర్ల కోసం చేస్తున్న ఆత్మగౌరవ పోరాటం అని శరత్ చంద్ర తెలిపారు.

కొరటాల శివ ఇంకో సినిమా తీయకుండా చేయాలని (Sharat Chandra) శరత్ చంద్ర చెప్పుకొచ్చారు. కథ చౌర్యం చేయడం మాత్రం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. అయితే శరత్ చంద్ర కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథల మధ్య పోలికలు ఉండటం సర్వ సాధారణమని ప్రతి కథ ఆయనదే అని చెప్పడం రైట్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus