శర్వానంద్ – సుదీర్ వర్మ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్..!

‘స్వామిరారా’ ‘దోచేయ్’ ‘కేశవ’ వంటి చిత్రాలతో విభిన్న దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు సుధీర్ వర్మ. ఆయన డైరెక్షన్లో శర్వానంద్ ఓ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్ర విడుదల తేదీ ను ఖరారు చేసేశారని సమాచారం. మే 31 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ చిత్రం ‘డియర్ కామ్రేడ్’ కూడా విడుదలవుతుంది. దీంతో పాటూ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిత్రం ‘ఎన్జీకే’ కూడా విడుదల కాబోతుందని సమాచారం.

శర్వానంద్ చిత్రమంటే కచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుందని ప్రతేయకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ గ్యాంగ్ స్టర్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో కాజల్ ఓ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శిన్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది. చిత్రబృందం కూడా ఈ చిత్రాన్ని మే 31నే విడుదల చెయ్యాలని సమ్మర్ హాలిడేస్ లో మిగిలిన రెండు వారాల్ని మిస్ చేసుకోకూడదని వారు భావిస్తున్నారట. ఈ దశలో విజయ్ దేవరకొండ, సూర్య,శర్వానంద్, ల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. మరి ఈ మూడు చిత్రాల రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus