ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో అతనికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు అలాగే, ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు, నటీనటులు, తోటి హీరోలు.. ఇలా చాలా మంది శర్వానంద్ కు.. తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇది పక్కన పెడితే.. సడన్ గా శర్వానంద్ తండ్రి అయినట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అవును శర్వానంద్ భార్య రక్షిత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అంతేకాకుండా పాపకి పేరు కూడా పెట్టేసినట్టు ప్రకటించారు. శర్వానంద్ తన పాపకి లీలా దేవి అనే పేరు కూడా ఫిక్స్ చేసేయడం ఇంకో విశేషం అని చెప్పాలి.
వాస్తవానికి శర్వానంద్ భార్య ప్రెగ్నెన్సీ వార్తలు బయటకి వచ్చింది లేదు. అంత ప్రైవసీ మెయిన్టైన్ చేశారు. మీడియాకి తెలీకుండా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అంటే మాటలు కాదు. ఇక 2023 జూన్ 3న శర్వానంద్- రక్షిత ల వివాహం జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్..శర్వానంద్ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో శర్వానంద్ పెళ్లి జరిగింది. హైదరాబాద్లో రిసెప్షన్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.