శర్వానంద్ ఇంటెలిజెంట్ డెసిషన్!

సినిమా ఇండస్ట్రీపై కరోనా ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు అన్నీ ఆగిపోయాయి. సినిమాల కోసం అప్పు తెచ్చిన నిర్మాతలకు వడ్డీలు కట్టడంతోనే సరిపోయింది. దీంతో నిర్మాతలు ఆచితూచి ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు లేని సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో సినిమాపైనే నలభై కోట్లు పెట్టుబడి పెట్టలేక నిర్మాతలు తప్పుకుంటే మరో నిర్మాత టేకప్ చేశారు.

దీని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఎవరైతే రెమ్యునరేషన్ పరంగా ఫ్లెక్సిబుల్ గా ఉన్నారో వారికే నిర్మాతలు ప్రాధాన్యతనిస్తున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న హీరో శర్వానంద్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట. అందుకే ఇప్పుడు ఏ హీరోకి లేనన్ని సినిమాలు శర్వా చేతిలో ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇటీవల తను నటించిన సినిమాలు కూడా ఆశించిన విజయాలను అందుకోలేకపోవడంతో శర్వా.. ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

శర్వా సినిమాలకు రిటర్న్స్ గ్యారెంటీ ఉంటాయి కాబట్టి నిర్మాతలు కూడా శర్వానంద్ బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో రెమ్యునరేషన్ విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉన్న హీరోలకే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus