బాలీవుడ్ లో ఫ్లాపైన సినిమా రీమేక్ లో హీరోగా శర్వానంద్

  • October 22, 2018 / 12:38 PM IST

సాధారణంగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేస్తుంటారు. ఇది అన్నీ ఇండస్ట్రీల్లో రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. కానీ.. మన తెలుగు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మాత్రం విచిత్రంగా హిందీలో ఫ్లాప్ గా నిలిచిన ఓ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీలో రాజ్ కుమార్ రావు-కృతి కర్భందా జంటగా తెరకెక్కిన “షాదీ మే జరూర్ ఆనా” అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు.

ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ అనిల్ సుంకర దగ్గర శర్వా డేట్స్ ఉండడంతో.. ఈ సినిమాను శర్వా హీరోగా తీద్దామని ప్లాన్ చేస్తున్నాడట. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులే ఆదరించలేకపోయారు. అలాంటిది తెలుగులో ఆడుతుందని నిర్మాత ఎలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. పైగా.. ఈ చిత్రంలో పెద్ద మొత్తంలో బడ్జెట్ ఖర్చు చేయనున్నాడట అనిల్ సుంకర. ఇకపోతే.. శర్వానంద్ నటించిన “పడి పడి లేచే మనసు” డిసెంబర్ 21న విడుదలకానుంది. ఈ సినిమాపై శర్వా చాలా ఆశలు పెట్టుకొన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus