శర్వానంద్ సరేనన్నాడు కానీ.. సమంత ఒకే చెప్పలేదు

గత కొంతకాలంలో తమిళ బాక్సాఫీస్ దగ్గర, తెలుగు మీడియా దగ్గర హల్ చల్ చేస్తున్న సినిమా “96”. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా రూపొందిన ఈ చిత్రం అక్కడ కమర్షియల్ & ఎమోషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు దిల్ రాజు రైట్స్ కొనుక్కొని నానిని హీరోగా అనుకున్నప్పటికీ.. నాని నో చెప్పడంతో ఆ తర్వాత గోపీచంద్, తర్వాత మరో యువ హీరో ఇలా చాలా మంది హీరోలు మారుతూ వచ్చారు. ఇంకొందరేమో క్లైమాక్స్ మార్చమని చెప్పడం.. అది ఇష్టం లేని తమిళ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ససేమిరా అనడంతో ప్రొజెక్ట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.

అయితే.. మొన్నామధ్య ఈ రీమేక్ లో శర్వానంద్ నటిస్తున్నాడు అనే వార్తలు వినిపించడంతో మంచి హీరోనే సెట్ అయ్యాడు అనుకొన్నారు. అయితే.. శర్వా కానీ, దిల్ రాజు కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ చేయకపోవడంతో ఇది కూడా గాలివార్తేనేమో అనుకొన్నారు. కానీ.. “పడి పడి లేచే మనసు” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “96 సినిమా చూశాను, చాలా బాగా నచ్చింది. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇస్తాను” అని చెప్పడంతో శర్వా హీరోగా చేయడం పక్కా అని తెలిసిపోయింది. ఇకపోతే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను అనుకొన్నారు.. కానీ ఆల్రెడీ ఆ తరహాలో “ఎటో వెళ్లిపోయింది మనసు” అనే సినిమా చేసిన సమంత ఈ సినిమా రీమేక్ ను ఎస్ చెప్పాలా వద్దా అనే ఆలోచనలోనే ఉందట. సో, ఇప్పుడు 96 రీమేక్ కోసం హీరో రెడీ కానీ హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus