శర్వానంద్ శ్రీకారం స్టోరీ లైన్ అదేనట

జాను చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు హీరో శర్వానంద్. సమంత జంటగా దిల్ రాజు నిర్మాణంలో సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన జాను మూవీ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సమంత, శర్వాల నటనకు మంచి ప్రశంలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్ మీడియాతో ముచ్చటించారు. పనిలో పనిగా ఆయన తదుపరి చిత్రం శ్రీకారం ముచ్చట్లు కూడా చెప్పారు. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శర్వా నంద్ పల్లెటూరి యువ రైతుగా చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్ర స్టోరీ లైన్ మీడియాతో పంచుకున్నారు శర్వా. సొసైటీ లో ఉండే వివిధ వృత్తులలోని వారు తమ పిల్లలు అదే వృత్తి చేపట్టాలని భావిస్తున్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలని అలాగే లాయర్ కొడుకు లాయర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఒక రైతు కొడుకు రైతు కావాలని కోరుకోవడం లేదు. ఎందుకు రైతు కొడుకు రైతు కావాలని కోరుకోకూడదు అనే పాయింట్ ఆధారంగా శ్రీకారం సినిమా తెరకెక్కుతుంది అని చెప్పుకొచ్చారు. పల్లెటూరి నేపథ్యంలో నడిచే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా మిగతా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus