Sharwanand: సినిమా కన్నా ఆరోగ్యమే ముఖ్యం: శర్వానంద్

  • September 16, 2022 / 07:32 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందిన శర్వానంద్ ఇటీవల” ఒకే ఒక జీవితం “సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో అక్కినేని అమల, వెన్నెల కిషోర్, నాజర్, ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రలలో నటించారు.

టైం ట్రావెల్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుని ఇప్పటికే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ తన బరువు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సినిమాల కోసం బరువు పెరిగేలా ఉంటే అటువంటి సినిమాలు తాను చేయనని కచ్చితంగా చెప్పేసాడు.

ఎందుకంటే దాదాపు తొమ్మిది నెలలు కష్టపడి శర్వానంద్ బరువు తగ్గి మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. బరువు పెరగటం చాలా సులభమైన పని కానీ బరువు తగ్గటం మాత్రం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాల కోసం తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోనని సినిమాల కన్నా ఆరోగ్యమే తనకి ముఖ్యం అంటూ వెల్లడించాడు.

సినిమాల కోసం బరువు పెరిగి మళ్లీ సన్నబడటానికి పడే మెంటల్ టెన్షన్ నాకు అవసరం లేదు. నేను మళ్లీ ఆ మెంటల్ ట్రామాలోకి వెళ్లలేనంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. ఇకపై తన బాడీలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం వస్తే సినిమాలను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని శర్వానంద్ కచ్చితంగా చెప్పేసాడు

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus