వరుసగా స్టార్ హీరోయిన్లతో శర్వానంద్..?

ఇటీవల శర్వానంద్ హీరోగా వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. శర్వానంద్ – సాయి పల్లవి కాంబినేషన్ కావడం… అలాగే విభిన్న చిత్రాలని తెరకెక్కించే హను రాఘవపూడి డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్నో ఆశలతో థియేటర్ వచ్చిన ప్రేక్షకులు మాత్రం నీరు కారిపోయారు. గతంలో శర్వానంద్ కి ప్లాపులు ఉన్నప్పటికీ.. ఈ రేంజ్లో డిజాస్టర్ పడలేదు. దీంతో తన తదుపరి సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్లో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కాజల్ , అలాగే ‘హలో’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ‘స్పెయిన్’లో జరుగుతోంది. సుమారు 250 మంది డాన్సర్లతో శర్వానంద్ – కాజల్ పై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రంతో మొదటి సారి జతకడుతున్నారు కాజల్ – శర్వానంద్. దీంతో ఈ చిత్రం పై మరింత క్రేజ్ నెలకొంది. ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుందట. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం.

త్వరలోనే ఈ చిత్ర టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్, మరియు టీజర్ ను విడుదల చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ఈ చిత్రం కచ్చితంగా తనకి హిట్ ఇస్తుందని నమ్మకంతో శర్వానంద్ భావిస్తున్నాడట. ఇక ఈ చిత్రం తరువాత దిల్ రాజు నిర్మిస్తున్న ’96’ రీమేక్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు శర్వా. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన పూర్తి నటీనటుల వివరాల్ని త్వరలో ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉంటే.. కాజల్, సమంత… ఇలా వరుసగా స్టార్ హీరోయిన్లతో నటిస్తున్న శర్వా ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యాడు.Sharwanand

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus