Chiru154: అందరికీ చిరు షాక్‌.. కానీ చిరుకి శేఖర్‌ మాస్టర్‌ షాక్‌!

అందరి సినిమా విషయాలు, పనిలోపనిగా తన సినిమా విషయాలు లీక్‌ చేయడంలో చిరంజీవి దిట్ట అని చెప్పొచ్చు. కావాలని చెబుతారో, అనుకోకుండా చెప్పేస్తారో తెలియదు కానీ… సినిమా గురంచి ఎవరికీ తెలియని విషయాలను ఆయన ఏదో వేదికలో చెప్పేస్తుంటారు. అలాంటి చిరంజీవి సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ చెప్పేశారు. ఇటీవల యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్న శేఖర్‌.. పనిలోపనిగా చిరంజీవి సినిమా విషయం చెప్పేశారు.

Click Here To Watch NOW

శేఖర్‌ మాస్టర్‌ సమర్పణలో ‘ధర్మపురి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శేఖర్‌ మాస్టర్‌ ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. అలా మాట్లాడుతూ ‘ఆచార్య’లోని ‘భలే బంజారా…’ పాట స్టెప్పుల గురించి కూడా మాట్లాడారు. చిరంజీవి, రామ్‌చరణ్‌పై ఈ పాట చిత్రీకరించారు. ఈ పాట గురించి చెబుతూ… చిరంజీవి నెక్స్ట్‌ సినిమాల్లోని పాటల గురించి కూడా రెండు మూడు ముక్కలు మాట్లాడారు. చిరంజీవి – మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంకర్‌’లో ఓపాట కంపోజ్‌ చేశానని చెప్పిన శేఖర్‌ మాస్టర్‌, ‘వాల్తేరు వీరయ్య’లో కూడా ఓ పాట చేశానని అన్నారు.

‘వాల్తేరు వీరయ్య’ అంటూ చిరంజీవి – బాబి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా. ఈ సినిమా టైటిల్‌ అదేనంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నా చిత్రబృందం ఎక్కడా కన్‌ఫామ్‌ చేయలేదు. ఇప్పుడు శేఖర్‌ మాస్టర్‌ వల్ల టైటిల్‌ అదేనని కన్‌ఫామ్‌ అయిపోయింది. అయితే బాబీ సినిమాకు టైటిల్‌ మరీ ఓల్డ్ పేరుగా ఉందని, ఇంకో టైటిల్ ట్రై చేస్తున్నారంటూ కూడా కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు శేఖర్‌ మాస్టర్‌ చెప్పడంతో అదే పేరుకు ఫిక్స్‌ అయిపోయారా అని అంటున్నారు.

అయితే ఆయన వర్కింగ్‌ టైటిల్‌ అనుకొని చెప్పారా? లేక నిజం టైటిల్‌ అనుకుని చెప్పారా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఇదే టైటిల్‌ అయితే సినిమా టీమ్‌ వేసుకున్న టైటిల్‌ రివీల్‌ హంగామా నీరుగారిపోయినట్లే. ఇప్పుడు టైటిల్‌ ఇలా బయటకు వచ్చేసింద కాబట్టి… డైరక్టర్‌ బాబి వేరే ఆలోచన ఏమైనా చేస్తాడేమో చూడాలి. ఏం చేసినా సినిమా పేరులో ‘వాల్తేరు’ అనేది పక్కగా ఉంటుందట. పక్కన పేరులోనే మార్పు రావాలి. చూద్దాం బాబి ఆలోచనలు ఎలా ఉన్నాయో.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus