జనవరి 26న షికారు విడుదల!

సాయి దన్సిక,తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్ముఖ్య పాత్రల్లో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై పి. ఎస్. ఆర్ కుమార్ (బాబ్జి,వైజాగ్ ) నిర్మిస్తున్న చిత్రం షికారు. ఈ చిత్రానికి స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :హరి కొలగాని. షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదలకు ఈ సినిమా సిద్ధం అవుతున్న సందర్బంగా సోమవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో

ప్రొడ్యూసర్ బాబ్జి మాట్లాడుతూ ఇక్కడకివచ్చిన మీడియా మిత్రులు అందరికి నా దానయవాదములు, కరోనా ఇబ్బందులు దాటుకొనిషికారు సినిమా పూర్తి చేసాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ ఆవు, మా హీరోయిన్ ధన్సిక చాలా బాగా చేసింది, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేసారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కధ చెప్పునప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను, మాకు మీడియా మిత్రులు సహకారం తో ఈ సినిమా ను ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాం దానికి మీడియా మిత్రులు అందరి సహకారం కోరుకుంటున్నాం, జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

-డైరెక్టర్ హరి మాట్లాడుతూ ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమా ని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారి కి థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు ఎవరు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు అలాగే టెక్నికల్ టీమ్ ని నాకు కావాల్సిన వాళ్ళని అందరిని సమకూర్చారు బాబ్జి గారు,మా హీరోయిన్ సాయి ధన్సిక చాలా బాగా చేసింది, ఈ మూవీ లో నలుగురు హీరో లని పరిచయం చేయటం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, రైటర్ కరుణ్ నాకు నా సినిమా కి బ్యాక్ బోన్ అని చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనులు లో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను., శేఖర్ చంద్ర ఫోర్ సాంగ్స్ కంపోజ్ చేశారు , భాస్కర్ పట్ల మూడు సాంగ్స్ రాసారు , మీ సహకారం తో ముందు ముందు ఇంకా కావాలి అని కోరుకుంటున్నాను.

-బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూముందు గా షికారు టీం కి నమస్కారం, ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీ లో తెలుగు సినిమా చరిత్ర లో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు, సినిమా మీద వున్న ఆయనకున్న జడ్జిమెంట్ ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు అని చెప్పాలి. తనకి ఒక జడ్జిమెంట్ వుంది నేను ఏ సినిమా లు చేసిన తన జడ్జిమెంట్ తీసుకుంటాను, ప్రొడ్యూసర్ గా చేయటం తన డ్రీం, హరి తో కూడా నాకు జర్నీ ఉంది తరువాత బాబ్జి గారి కి వినిపించడం అలా సినిమా స్టార్ట్ అవ్వటం జరిగింది. యూత్ అంత అట్ట్రాక్ట్ అయ్యే సినిమా, టీమ్ కి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా ఈ సినిమా కి బాబ్జి గారు ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తారు, ఈ సినిమాఆయనకి ప్రొడ్యూసర్ గా మంచి జర్నీ కి పునాది కావాలి అని కోరుకుంటున్నాను.

-ప్రొడ్యూసర్ డి. ఏస్. రావు గారు మాట్లాడుతూ షికారు మన జీవితంలో ప్రతి రోజు గంట లేదా అరగంట షికారు చేస్తూవుంటాము, మొదటి గా షికారు టీమ్ అందరికినా అభినందనలు, ప్రొడ్యూసర్ బాబ్జి గారు మా పిల్ల జమిందార్ డిస్ట్రిబ్యూటీర్, కధ ల విషయం లో మంచి అవగాహనా వుంది , అఖండ సినిమా హిట్ అవ్వగానే బాబ్జి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు మళ్ళీ థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తున్నారు,షికారు మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

-రైటర్ కరణ్ మాట్లాడుతూ మా షికారు సినిమా లో రెండున్నర గంటలు ఫన్ ఉంటుంది,ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ హరి మరియు ప్రొడ్యూసర్ బాబ్జి గారి కి నా కృతజ్ఞతలు

అభినవ్ మాట్లాడుతూ డైరెక్టర్ హరి గారుప్రొడ్యూసర్ బాబ్జి గారు ఒక స్క్రిప్ట్ తో వచ్చారు, ఇంత మంచి స్క్రిప్ట్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, హీరోయిన్ సాయిధన్సిక లీడ్ రోల్ చేస్తుంది , టోటల్ జర్నీ షూట్ బాగా ఎంజాయ్ చేసాము, మీ అందరి సహకారం కావాలి అని కోరుకుంటున్నాను.

హీరోయిన్ సాయి ధన్సిక చెపుతూ మీరు అందరు ఇక్కడకి వచ్చింది థాంక్స్, అందరికి రిక్వెస్ట్ చేసి చెపుతున్నాను అందరు సేఫ్ గా వుండండి, ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్, తమిళ్ లో చాలా ఫిల్మ్స్ చేశాను,కబాలి లో చేశాను, హరి గారు చెన్నయ్ వచ్చి కధ చెప్పారు, మీ కళ్ళు చూసి ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని హరి గారు చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్, ప్రొడ్యూసర్ గారి తో అలాగే డైరెక్టర్ గారి తో నాకు చాలా కంఫర్ట్ వుండింది,ఈ మూవీ లో నాతో యాక్ట్ చేసిన మా టీమ్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus