Shilpa Shetty: షెర్లిన్ పై రూ.50 కోట్ల పరువు నష్టం దావా!

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బెయిల్ కోసం అప్లై చేయగా.. పలుమార్లు రిజెక్ట్ అయింది. రీసెంట్ గానే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ కేసు ఆరోపణల విషయంపై శిల్పా దంపతులు నటి షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తనను బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్ చోప్రా

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా జైల్లో ఉన్న సమయంలో ఆరోపించింది. ఈ విషయంలో పరోక్షంగా శిల్పాశెట్టిని కూడా టార్గెట్ చేసింది. ఇటీవల సైతం అతను లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరింది. తాజాగా ఈ కేసు విషయమై షెర్లిన్ ఆరోపణలు నిరాధారమని.. కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫు న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అవాంఛిత వివాదాలను సృష్టించడానికి..

మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆ నటి ప్రయత్నిస్తుందే తప్ప అందులో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నారు. మరి దీనిపై షెర్లిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus