గతేడాది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన జోడీలలో శిల్పాశెట్టి రాజ్ కుంద్రా జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ కాగా ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. గతంలో ఈ జంట విడిపోనుందని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తను ఈ జంట ఖండించారు. అయితే బాలీవుడ్ లో ఈ జంట విడిపోనుందని మళ్లీ వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ప్రస్తుతం శిల్పాశెట్టి రాజ్ కుంద్రా మధ్య ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాజ్ కుంద్రా శిల్పాశెట్టి పేరుపై బదలాయించడం గమనార్హం. దాదాపుగా 39 కోట్ల రూపాయల విలువైన అపార్టుమెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని రాజ్ కుంద్రా శిల్పాశెట్టి పేరుపై బదలాయించారు. కినారాలోని బీచ్ వ్యూలో ఉన్న ఈ అపార్టుమెంట్ తో పాటు రాజ్ కుంద్రా ఫామ్ హౌజ్ ను కూడా ఆమె పేరుపై బదలాయించాడని తెలుస్తోంది. ఆస్తుల బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీళ్లిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగే అవకాశాలు తక్కువని సమాచారం.
బీచ్ కు 300 మీటర్ల దూరంలో ఈ అపార్టుమెంట్ ఉందని బోగట్టా. త్వరలో శిల్పాశెట్టి రాజ్ కుంద్రాల విడాకుల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వీళ్లిద్దరి అభిమానులు మాత్రం వీళ్లు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్ కుంద్రా వివాదంలో చిక్కుకున్న తర్వాత శిల్పాశెట్టికి గతంతో పోలిస్తే ఊహించని స్థాయిలో సినిమా ఆఫర్లు తగ్గాయి. బాలీవుడ్ మీడియాలో మాత్రం వీళ్లిద్దరూ కచ్చితంగా విడిపోతారని ప్రచారం జరుగుతోంది.
తెలుగులో శిల్పాశెట్టి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. తర్వాత కాలంలో శిల్పాశెట్టి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్ మరి కొందరు హీరోలకు జోడీగా శిల్పాశెట్టి నటించారు.