శిల్పాశెట్టి విడాకులు తీసుకోబోతుందా..?

‘సాహస వీరుడు సాగర కన్య’ ‘వీడెవడండీ బాబు’ ‘ఆజాద్’ ‘భలే వాడివి బాసు’ వంటి తెలుగు చిత్రాలతో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. నాలుగు పదుల వయసు మీద పడుతున్నప్పటికీ… కూడా ఇంకా స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తూ యువ హీరోయిన్లకు గట్టి పోటీగా ఇస్తుంది శిల్పాశెట్టి. తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. 2009 ఫిబ్రవరి లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుండ్ర ని విహహం చేసుకుని సినిమాలు తగ్గించేసింది శిల్పా శెట్టి. వీరికి వియాన్ రాజ్ కుండ్ర అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పటి వరకూ వీరి దాంపత్య జీవితం భాగానే ఉంది. అయితే తాజాగా ఆమె విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్త బయటకి రావడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. అయితే తరువాత అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తుంది.

అసలు విషయాన్ని పరిశీలిస్తే…. శిల్పా, అనురాగ్ బసు, గీతా కపూర్ లు ‘సూపర్ డాన్స్ 3’ అనే రియాలిటీ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా శిల్పాకి తెలియకుండా.. అనురాగ్ ఆమె ఫోన్ తీసుకొని ‘నేను, రాజ్ కుంద్రా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం’ అంటూ ఆమె తల్లి సునంద శెట్టికి మెసేజ్ పంపాడట. దీంతో శిల్పా శెట్టి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారట. వెంటనే శిల్పా తల్లి అయిన సునంద శెట్టి.. శిల్ప కి ఫోన్ చేసి ఇదంతా నిజమేనా అని అడిగారట. ఇక ఆ వెంటనే శిల్పా కు.. గీతాకపూర్ అసలు విషయం చెప్పడంతో శిల్పా వెంటనే తన తల్లికి ఫోన్ చేసి.. అదేం లేదని, జోక్ గీత కపూర్ జోక్ చేశారని.. ఇలాంటి విషయాలు నాకు నేనుగా ఇంటికి వచ్చి చెప్పే వరకూ నమ్మొద్దంటూ చెప్పుకొచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus