Shiva 4K: కల్ట్ క్లాసిక్ ‘శివ’.. ఆ టాప్ 10 లిస్ట్‌లోకి వస్తుందా?

తెలుగు సినిమా చరిత్రను ‘శివ’కు ముందు, ‘శివ’కు తర్వాత అని విభజించవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జునను కల్ట్ హీరోగా నిలబెట్టి, రామ్ గోపాల్ వర్మ అనే సంచలనాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ఇది. సౌండ్ డిజైన్, కెమెరా యాంగిల్స్, స్టూడెంట్ పాలిటిక్స్.. ఇలా ప్రతి విషయంలోనూ శివ ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు ఈ లెజెండరీ ఫిల్మ్, నవంబర్ 14న 4K టెక్నాలజీతో గ్రాండ్‌గా రీ రిలీజ్ కాబోతోంది. ఇది నాగార్జున కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక బిగ్ రికార్డ్.

Shiva 4K

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ పీక్స్‌లో ఉంది. ఇది కేవలం పాత సినిమాలను మళ్లీ వేయడం కాదు, ఇదొక కొత్త బాక్సాఫీస్ యుద్ధంలా మారింది. గతంలో మహేష్ బాబు (ఖలేజా, మురారి’), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్, ఖుషి), ఎన్టీఆర్ (సింహాద్రి), అల్లు అర్జున్ (ఆర్య 2) చిత్రాలు కోట్లు కొల్లగొట్టాయి. తమిళంలో విజయ్ గిల్లి ఏకంగా 32 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్‌లను కొత్త సినిమాల కంటే పెద్ద ఈవెంట్‌లా సెలబ్రేట్ చేస్తున్నారు.

అయితే, ఈ రీ రిలీజ్ మార్కెట్‌లో నాగార్జున ట్రాక్ రికార్డ్ మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. ఆ మధ్య నాగార్జున కెరీర్‌లోని బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌లో ఒకటైన ‘మాస్’ సినిమాను రీ రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమాకు కనీస స్పందన రాలేదు. ట్రేడ్ టాక్ ప్రకారం, ‘మాస్’ రీ రిలీజ్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ చెప్పుకోదగ్గ గ్రాస్ నెంబర్ ని దాటలేదని టాక్.

కానీ, ‘మాస్’ వేరు, ‘శివ’ వేరు. ‘మాస్’ ఒక పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమా, దానికి నాస్టాల్జియా వాల్యూ కేవలం ఫ్యాన్స్‌కే పరిమితం. ‘శివ’ అలా కాదు, అదొక ‘కల్ట్ క్లాసిక్’. అది కేవలం ఫ్యాన్స్ సినిమా కాదు, అది ఫిల్మ్ లవర్స్ సినిమా. తెలుగు సినిమా మేకింగ్‌ను మార్చేసిన ఆ సౌండ్ డిజైన్, ఆ ‘సైకిల్ చైన్’ సీన్‌ను 4Kలో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కొత్త తరం ప్రేక్షకులు, ఫిల్మ్ స్టూడెంట్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ‘మాస్’తో ‘శివ’ను పోల్చలేం.

ప్రస్తుతం టాప్ 10 రీ రిలీజ్ కలెక్షన్ల లిస్ట్ చూస్తే..

గిల్లి 4K (విజయ్): రూ.32.50 కోట్లు
సచిన్ (విజయ్) రూ.13.60 కోట్లు
ఖలేజా 4K (మహేష్ బాబు) : రూ.10.78 కోట్లు
మురారి 4K (మహేష్ బాబు) : రూ.8.90 కోట్లు
గబ్బర్ సింగ్ 4K (పవన్ కళ్యాణ్) : రూ.8.01 కోట్లు
ఖుషి (పవన్ కళ్యాణ్) : రూ.7.46 కోట్లు
ఆర్య 2 (అల్లు అర్జున్) : రూ.6.75 కోట్లు
SVSC (మహేష్ బాబు) : రూ.6.60 కోట్లు
అతడు 4K (మహేష్ బాబు) : రూ.6.45 కోట్లు
బిజినెస్‌మ్యాన్ 4K (మహేష్ బాబు) : రూ.5.85 కోట్లు

ఈ లిస్ట్ చూశాక, ‘శివ’ 4K ముందు పెద్ద సవాలే ఉంది. నాగార్జున రీ రిలీజ్ నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, ‘శివ’ కల్ట్ స్టేటస్ ఆ సినిమాను టాప్ 10 లిస్ట్‌లో నిలబెడుతుందా? లేక ‘మాస్’ సినిమా లాగే నిరాశపరుస్తుందా? అనేది నవంబర్ 14న తేలిపోతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus