Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

ఒక సినిమా హిట్‌ కొట్టడం ఆలస్యం.. ఆ తర్వాత సినిమా గురించి ఎవరితో లింక్‌ చేద్దామా అని చూస్తుంటారు మన టాలీవుడ్‌ జనాలు. ఈ క్రమంలో కొన్ని వండిన రూమర్లు క్లిక్‌ అయి.. నిజమైపోతుంటాయి కూడా. ఇప్పుడు ఇలా అవుతుందో లేదో తెలియదు కానీ.. ‘ఇరుముడి’ డైరెక్టర్‌ శివ నిర్వాణ విషయంలో ఇలాంటి ఓ చర్చ మొదలైంది. అంతకుముందు ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ దర్శకుడు వెంకీ అట్లూరి విషయంలోనూ ఇలాంటి డిస్కషనే జరిగింది. దానికి ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు అనుకోండి.

Chiranjeevi – Siva Nirvana

ఇక ఇప్పటి విషయం చూస్తే.. విజయ్‌ దేవరకొండ – సమంతల ‘ఖుషి’ సినిమా లాంటి దారుణ పరాజయం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని ‘ఇరుముడి’ అంటూ వచ్చి భారీ విజయం ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ చూడని విజయం అందుకున్నారు శివ నిర్వాణ. ఆయన నెక్స్ట్‌ సినిమా ఏంటి అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద ఆ సినిమా ఉంటుంది అని ఓ టాక్‌ కూడా ఉంది. ఆ విషయం పక్కన పెడితే హీరో ఎవరు అనేదే ప్రశ్న.

దీనికి ప్రస్తుతం వినిపిస్తున్న పేరు చిరంజీవి. అవును ఆయనతో శివ నిర్వాణ ఓ సినిమా తీస్తారు అని అంచనాలు వేసేస్తున్నారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌కు శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్‌ తోడైతే ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ వచ్చే అవకాశం ఉందనేది చర్చ సారాంశం. చిరంజీవికి సరైన ఎంటర్‌టైనర్‌ పడితే ఎలా ఉంటుంది మొన్న సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ ద్వారా చూశాం. ఇప్పుడు శివ నిర్వాణ కూడా అలాంటి స్టఫ్‌ ఇవ్వగలరు. మరి చిరంజీవికి శివ కథ చెప్పి ఓకే చేయించగలరా అనేదే ప్రశ్న.

ఎందుకంటే చిరంజీవి దగ్గర కథ ఓకే అవ్వడం అంత ఈజీ కాదు. గతంలో వెంకీ కుడుముల ఇలానే కథ చెప్పి.. ఓకే చేయించుకోలేకపోయారు. పూరి జగన్నాథ్‌ కూడా అంతే. కాబట్టి శివ సంగతి అప్పుడే తేల్చేయలేం.

భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus