వైరల్ అవుతున్న శివాని లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

రాజశేఖర్ కుమార్తెలను హీరోయిన్లుగా పరిచయం చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండవ కుమార్తె శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి పెద్ద కుమార్తె శివాని డెబ్యూ ఎప్పుడో అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అడివిశేష్ హీరోగా శివానీ హీరోయిన్ గా ‘2 స్టేట్స్’ అనే చిత్రం రావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో శివాని ఇంకా తన డెబ్యూ చిత్రం కోసం ఎదురు చూస్తూనే ఉంది.

ఇక తన మొదటి సినిమా రిలీజయ్యే లోపే… వీలైనంత ఎక్కువ కొత్త ఫోటో షూట్లు చేసి కుర్ర కారుని తన వైపు తిప్పుకోవాలని భావిస్తుందనుకుంట. ఇప్పుడు అలాంటి ఫోటో షూట్లో పాల్గొని ఆ ఫోటోలని కాస్త.. తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు లైకులు వర్షం కురిపించారు నెటిజన్లు. సాధారణంగా పెద్ద ఫ్యామిలీ నుండీ వచ్చే అమ్మాయిలు ఎక్కువ గ్లామర్ షో చేయరు. అయితే అది టాలీవుడ్ లో మాత్రమే. బాలీవుడ్లో అయితే అలా కాదు. అక్కడ స్టార్ హీరోల ఫ్యామిలీ నుండీ వచ్చినా గ్లామర్ షో తో దుమ్ము రేపుతారు. ఇప్పుడు శివాని కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నట్టు ఉంది. ఓ మోడల్ రేంజు లో ఫోజులిచ్చి కట్టిపడేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus