Bigg Boss 7 Telugu: తేజ వెళ్లిపోతూ శోభని ఏమడిగాడో తెలుసా ? శోభాశెట్టి చెప్పింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఏ సీజన్ లో కూడా జరగనిది ఈ సీజన్ లో జరుగుతోంది. మొదటి వారం నుంచీ లవ్ ట్రాక్స్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్ – రతిక ఇద్దరూ కూడా రెండువారాలు ఇలాగే గడిపారు. ఆ తర్వాత శుభశ్రీ – గౌతమ్ ఇద్దరి మద్యలో కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ చేయాలని చూశారు. అది ఘోరంగా ఫైయిల్ అయ్యింది. కుబూల్ హై.. కుబూల్ హై అంటూ యావర్ థామినితో ట్రాక్ నడపించాలని చూశాడు. అది కూడా థామిని ఎలిమినేషన్ తో పక్కకి వెళ్లిపోయింది.

పల్లవి ప్రశాంత్ తో గొడవ అయ్యాక రతిక కూడా యావర్ తో ట్రాక్ నడిపిద్దామని అన్వర్.. అన్వ ర్ అంటూ సినిమాటిక్ వేషాలు వేసింది. కంప్లీట్ గేమ్ రివర్స్ అయి ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇన్నివారాలు గడిచిన తర్వాత యావర్ అశ్వినితో విల్ యూ మ్యారీమీ అని అడిగాడు. సరదా , సరదాగానే ఈ మాట అనేశాడు యావర్. దీంతో అశ్విని తెగ సిగ్గుపడిపోయింది. పక్కనే ఉన్న గౌతమ్ ని కూడా చాలా క్యూట్ బాయ్ అంటూ మాట్లాడింది. వీరిద్దరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే, తేజ ఎలిమినేట్ అయిపోతూ శోభాశెట్టిని డైరెక్ట్ గా స్టేజ్ పైన నాగార్జున సాక్షిగా ప్రపోజ్ చేశాడు. కానీ, శోభాశెట్టి ఏవిషయం కూడా చెప్పలేదు. నిజానికి శోభాశెట్టి – తేజ ఇద్దరూ కూడా హౌస్ లో మంచి కంటెంట్ ని జనరేట్ చేశారు. అలకలు, గొడవలు, ఫ్రస్టేషన్స్, ఎమోషన్స్, ఇలా చాలా కంటెంట్ ఇచ్చారు. అయితే, తేజ ఎలిమినేషన్ తో ఒక్కసారిగా హౌస్ లో అందరూ షాక్ అయ్యారు. తేజ వెళ్లిపోతుంటే శోభా వెక్కి వెక్కి ఏడ్చింది.

ఇక స్టేజ్ పైకి వచ్చిన తేజ అందరికీ మార్కులు ఇచ్చాడు. శోభాశెట్టికి 10కి 20 మార్కులు ఇవ్వచ్చని మనసులో ఏదీ కూడా దాచుకోకుండా చెప్పేస్తుందని అన్నాడు. నాగార్జున మరి ట్యాటూ వేయించుకుంటావా అని టీజ్ చేస్తుంటే, ఇప్పటికైనా చెప్పవే బయటకి వచ్చా కదా.. ఓకే అంటే వెంటనే వేయించుకుంటా అంటూ శోభాశెట్టికి ప్రపోజ్ చేశాడు. దీనికి కళ్లనీళ్లు పెట్టుకుంటూ, మౌనంగా అలా చూస్తూ ఉండిపోయింది.

శోభాశెట్టి నువ్వు లేకండా ఇంకా కొన్ని వారాలు ఉండాలంటే నావల్ల కాదు. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ శోభాని ఓదార్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినకుండా చాలాసేపు అలాగే ఉండిపోయింది. ప్రియాంక వచ్చి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణాలకి కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా జరిగాయ్. బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఈ సీజన్ లో అయితే తేజ ఎలిమినేషన్ అనేది సండే హైలెట్ గా నిలిచింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus