Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మోనిత విశ్వరూపం..! భోలే నిజస్వరూపం చూపించిన శోభాశెట్టి..!

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం నామినేషన్స్ రచ్చ లేపాయి. ముఖ్యంగా శోభాశెట్టి పూర్తిగా కార్తీకదీపం మోనితలాగా మారి భోలేకి విశ్వరూపం చూపించింది. తనని నామినేట్ చేస్తూ మీరు అస్సలు గేమ్ సరిగ్గా ఆడలేదని చెప్పింది. మీ ఆట నాకు కనిపించలేదని క్లారిటీగా రీజన్ చెప్పింది. అక్కడ్నుంచీ భోళే షవాలి శోభాకి కౌంటర్స్ ఇస్తునే ఉన్నాడు. నిజానికి శోభాశెట్టి కంటే ముందే ప్రియాంకకి భోలేకి చాలా పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఇక్కడ వెటకారాలు కూడా నడిచాయ్. దీంతో హౌస్ మేట్స్ అందరికీ భోలే చేష్టలు, మాటలు నచ్చలేదు. దీంతో శోభాశెట్టికి మరింత బలం వచ్చింది.

రెచ్చిపోయి మరీ భోలేకి కౌంటర్స్ వేసింది. మాటకి మాట పెరిగింది. దీంతో భోలే బిగ్ బాస్ మోనిత అంటూ ముద్ర వేశాడు. దానికి శోభాశెట్టి..యస్ నేను మోనితనే, అదే క్యారెక్టర్ నాకు అన్నం పెట్టింది. ఈ బిగ్ బాస్ హౌస్ లో నన్ను నిలబెట్టింది అంటూ రెచ్చిపోయింది. భోళేని మాటకి మాట ఎదిరించి మరీ నిలిచింది. అంతేకాదు, మోనిత కొడితే ఇలా ఉంటుందంటూ కుండని గట్టిగా కసిగా పగలకొట్టింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ సైలైంట్ అయిపోయారు. ఆ తర్వాత భోలే షవాలి తిరిగి శోభాశెట్టిని నామినేట్ చేశాడు. రీజన్ చెప్పమంటూ మరోసారి శోభా నిలదీసింది.

మోనిత అంటూ ముద్ర వేశారు కదా.. దానికి రీజన్ చెప్పమని , అలాగే నామినేషన్ రీజన్ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాడంటూ మాట్లాడింది. అమ్మా అమ్మా అంటే అయ్యా అయ్యా అంటూ భోలేని ఇమిటేట్ చేస్తూ కుండపై దరువేస్తూ చుక్కలు చూపింంచింది. దీంతో భోలేకి ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. మాటలు రాలేదు. నిజానికి భోలే ప్రియాంక నామినేట్ చేసేటపుడు పంచ్ లు, ప్రాసలకోసం పాకులాడాడు. అంతేకాదు, శోభ భోలేకి చాలాసేపు కుండని ఇవ్వకుండా ఆర్గ్యూమెంట్ చేసింది. రీజన్ చెప్పు లేదా నీ నిజస్వరూపం నేను బయటకి తీస్కుని వచ్చానని ఒప్పుకో అప్పుడు కుండని పగలగొట్టూ అంటూ మాట్లాడింది.

దీంతో భోలే రెచ్చిపోయాడు పాటకి లిరిక్స్ రాసినట్లుగా మాట్లాడుతూ వాళ్లకి అర్ధం కాకుండా అయ్యాడు. ఇక భోళే శోభని నామినేట్ చేస్తుంటే ప్రియాంక కూడా మద్యలోకి వచ్చింది. తనకి నచ్చని పాయింట్ ని ఎత్తి చూపించింది. . ప్రియాంక “థూ”.. అంటూ మాట్లాడింది. దీనికి భోలే చాలా హర్ట్ అయ్యాడు. ఆతర్వాత ప్రియాంక సారీ చెప్పినా కూడా మనస్పూర్తిగా చెప్పలేదు. మద్యలో ఇలా దూరినందుకు నిన్ను కూడా నామినేట్ చేస్తున్నా అంటూ భోలే షవాలి నామినేట్ చేశాడు. మొత్తానికి భోలేని ఒకవైపు ప్రియాంక, మరోవైపు శోభాశెట్టి లెఫ్ట్ రైట్ ఆడుకున్నారు. దీంతో (Bigg Boss 7 Telugu) 7వ వారం నామినేషన్స్ రసవత్తరంగా మారాయి. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus