Bigg Boss 7 Telugu: శివాజీ మాటకి హర్ట్ అయిన శోభాశెట్టి..! అసలు టాస్క్ అయిపోయాక ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం జిలేబీ పురం, గులాబీ పురం అనే టాస్క్ నడుస్తోంది. ఒక స్పేస్ షిప్ వచ్చి ఈ రెండు ఊర్ల మద్యలో క్రాష్ అయ్యిందని, ఇందులో ఉన్న ఏలియన్స్ సంతోష పడితే తిరిగి మళ్లీ వెళ్లిపోతారు కాబట్టి వారిని ఎంటర్ టైన్ చేస్తూ, ఇచ్చిన టాస్క్ లను చేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే ఎగ్ బ్యాలన్సింగ్ టాస్క్ ఇచ్చాడు. రెండు టీమ్స్ నుంచీ నలుగురు చైన్ సిస్టమ్ తో ఎగ్ ని స్టేట్ ప్లేయ ఉవుడ్ ప్లేట్ పైన బ్యాలన్స్ చేస్తూ హర్డిల్స్ దాటుకుంటూ ముందుకు వెళ్లాలి.

తమ పార్టనర్ కి జాగ్రత్తగా దానిని అందించాలి. ఇక్కడ రెండు టీమ్స్ చాలా ఫోకస్ గా గేమ్ ఆడాయి. ఫస్ట్ టీమ్ లో అశ్విని – ప్రశాంత్ – అర్జున్ – సందీప్ చైన్ సిస్టమ్ గా ఉన్నారు. సెకండ్ టీమ్ లో అమర్ – గౌతమ్ – యావర్ – శోభాశెట్టి చైన్ సిస్టమ్ గా ఉన్నారు. ఇక్కడే రెండు ఎగ్స్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది శోబా. లాస్ట్ లో ఓడిపోవడానికి కారణం అయ్యింది. తర్వాత బాగా ఫీల్ అయ్యింది.

యావర్ సరిగ్గా బ్యాలన్స్ చేయలేదని అందుకే నేను చేయలేకపోయానని చెప్పింది. ఇక్కడే టాస్క్ అయిపోగానే సంచాలక్ గా ఉన్న శివాజీ ప్రశాంత్ ఉన్న టీమ్స్ అన్నీ గెలుస్తాయి అన్నాడు. దీంతో అక్కడ ఉన్న అమర్ కి, సందీప్ కి కాలింది. ఈ మాటని శోభా చెవిలో వేశారు. అంతే, శోభా డైరెక్ట్ గా వచ్చి ఫేస్ టు ఫేస్ శివాజీని నిలదీసింది. అన్నా, మీరు అలా అనడం బాలేదు అన్నా, ప్రశాంత్ ఉన్న టీమ్స్ (Bigg Boss 7 Telugu) గెలుస్తున్నాయని చెప్పడం కరెక్ట్ కాదు.

మేము కూడా గేమ్స్ బాగా ఆడుతున్నామని ఢీ అంటే ఢీ అంటూ ప్రశ్నించింది. దీనికి శివాజీ తన ఉద్దేశ్యం అది కాదని కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు. శోభాశెట్టి కారణంగానే గేమ్ పోయిందని ఆ తర్వాత తేజ సరదాగా టీజ్ చేస్తుంటే శోభాశెట్టి తేజకి ఫుల్ గా క్లాసి పీకింది. కామెడీగా అన్నాను అని తేజ చెప్తున్నా వినిపించుకోలేదు. శివాజీ అన్నమాటని సందీప్, అమర్, శోభా ముగ్గురూ కూడా తీస్కోలేకపోయారు. మరి ఈ పాయింట్ పై వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus