టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ యేడాది యేడాదికి బాగా పెరిగిపోతోంది. రెండేళ్ల క్రితం రూ.50 కోట్ల బడ్జెట్ అంటే అమ్మో అనేవారు. ఇప్పుడు అది క్రమక్రమంగా 60-70-80 కోట్లను దాటేసి రూ.100 కోట్ల వైపు వెళ్లిపోతోంది.
పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే రూ.80 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టం కావడం లేదు. ఇక శాటిలైట్ రైట్స్ సైతం రూ.12-15 కోట్ల వరకు పలుకుతున్నాయి. దీంతో నిర్మాతలు సైతం భారీ రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు, భారీ బడ్జెట్ పెట్టేందుకు వెనుకాడడం లేదు.