బాహుబలి…ఈ పేరు ఇప్పుడు ప్రపంచం అంతటా మారు మ్రోగిపోతుంది…అంతేకాదు…బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమా కోసం దాదాపుగా 5ఏళ్లు కష్ట పడ్డాడు మన దర్శకుడు రాజమౌళి…సినిమాను చాలా పక్కాగా, పద్దతిగా తీర్చి దిద్దాడు…ఇక అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘బాహుబలి ది కంక్లూజన్’ చిన్నాపెద్దా అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా అందరి హీరోల అభిమానులను తన ధియేటర్లకు రప్పించుకునే స్థాయిలో ఉంది అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే అంత బడా సినిమాలో, అంతటి కష్టంలో కాస్త చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉండడం సహజం…ఆ చిన్న పొరపాట్లే ఇప్పుడు విమర్శకులకు ఆహారంగా మారాయి….ఈమూవీ ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం సుదీర్ఘంగా సాగతీతగా అనిపించింది అని చెబుతున్నారు విమర్శకులు…సెకండ్ ఆఫ్ నిడివి విషయంలో రాజమౌళి కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఉంటే మరింత బాగుండేది అన్న కామెంట్స్ బలంగా వస్తున్నాయి.
ఈ సెకండ్ ఆఫ్ పెద్దది అవ్వడంతో సినిమా నిడివి పెరిగిన నేపధ్యంలో ఈమూవీని చూడటానికి రిపీటెడ్ గా ప్రేక్షకులు రాజమౌళి కోరుకున్న రీతిలో ధియేటర్లకు వస్తారా అన్న సందేహాలను మరికొందరు విమర్శకులు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాకుండా…రాజమౌళికి తన కథ పై ఉన్న మితిమీరిన విశ్వాసంతో పాటు ‘బాహుబలి 2’ ఏర్పడిన విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ మూవీ సెకండ్ ఆఫ్ నిడివి విషయంలో రాజమౌళి పెద్దగా శ్రద్ధ పేట్టి ఉండడు అన్న కామెంట్స్ మరికొందరు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ… సినిమా ఆకట్టుకునేలా ఉండాలే కానీ.. సినిమా ఎంత పెద్దగా ఉన్నా.. మన తెలుగు వాళ్ళు పట్టించుకోరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఏది ఏమైనా…బాహుబలి2 బ్లాక్ బస్టెర్ హిట్ అంతే…నో మోర్ డౌట్స్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.