గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘రామబాణం’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందింది ‘రామబాణం’. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్లు బాగానే ఉన్నాయి.
గోపీచంద్ నుండి ప్రేక్షకులు ఆశించే మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి అని ప్రమోషనల్ కంటెంట్ చెబుతుంది. ఇక ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్స్ లో డింపుల్ హయాతికి చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు నిర్వహించిన ‘రామబాణం’ ప్రమోషనల్ ఈవెంట్లో డింపుల్ హయాతిని ఓ రిపోర్టర్ ఘోరమైన ప్రశ్నలు అడిగాడు.
‘రామబాణం’ ట్రైలర్లో డింపుల్ హయతి (Dimple Hayathi) వల్గర్ గా కనిపించిందని, ఆమె డ్రెస్సింగ్ ఫ్యామిలీ మూవీస్ కు తగ్గట్టు లేదని.. ఆమెను సినిమాలోకి ఎలా తీసుకున్నారు? అన్నట్టుగా దర్శకుడిని ఆ రిపోర్టర్ ప్రశ్నించాడు. అందుకు హీరోయిన్ డింపుల్ అయోమయంలో పడిపోయింది. ఈ క్రమంలో దర్శకుడు శ్రీవాస్ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ‘ ఫస్ట్ లుక్ లో కానీ, ట్రైలర్ లో కానీ ఆమె లుక్ మీకు అసభ్యకరంగా ఎలా కనిపించింది?’ అంటూ ప్రశించాడు.
అలాగే ‘ఖిలాడి’ సినిమాలో డింపుల్ ను ఒకలా చూశారు. ఆ ఇమేజ్ ఈమె పై పడకూడదు అని ‘రామబాణం’ సినిమాలో ఆమె పాత్రను, డ్రెస్ లను బాగా డిజైన్ చేశాం అంటూ చెప్పుకొచ్చాడు. మరో రిపోర్టర్ ఏకంగా డింపుల్ ను ఇలియానాతో పోల్చేశాడు. దానికి డింపుల్ హ్యాపీ అంటూ సరిపెట్టింది.