పొరపాటున కూడా మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్లను!

“నాకు పర్సనల్ గా నాని అన్నా, నాని సినిమాలన్నా చాలా ఇష్టం కానీ, ఒక హోస్ట్ గా మాత్రం నాని అంత సీన్ లేదనిపిస్తుంది. అతను స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్లిపోతున్నాడు తప్పితే పెద్దగా ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వడం లేదు” అంటూ బిగ్ బాస్ 2 తో బుల్లితెర ప్రేక్షకులను పలకరిస్తున్న నేచురల్ స్టార్ నానిపై ఘాటైన కామెంట్స్ చేసింది సెకండ్ సీజన్ లో ఫస్ట్ వీక్ కే ఎలిమినేట్ అయిన సంజన. ఈ మిస్ ఇండియా రన్నరన్ నాని హోస్టింగ్ గురించి మాత్రమే కాక బిగ్ బాస్ షో గురించి కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. తనకు బిగ్ బాస్ యాజమాన్యం రెమ్యూనరేషన్ గా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అడిగితే ఒక ప్లాట్ ఫార్మ్ ఇచ్చామని చెప్పారని ఆమె చెప్పారు.

నందిని రాయ్ రావడం ఒక వారం ఆలస్యం అవ్వడంతో కేవలం ఆ వారం రోజుల కోసం రీప్లేస్ మెంట్ గా వాడుకొన్నారని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆఖరికి నా ప్రోమో షూట్ కూడా నా డబ్బులతో చేయించుకొన్నాను. అలాంటిది ఇలా నన్ను మోసం చేయడం ఎంతవరకూ సబబు అని కామెంట్ చేస్తోంది సంజన. అయితే.. ఆన్ లైన్ లో మాత్రం.. “ఆల్రెడీ ‘నేనే రాజు నేనే మంత్రి, తను వచ్చేనంట’ లాంటి సినిమాల్లో నటించి, మోడల్ గా నాలుగేళ్ల ఎక్స్ పీరియన్స్ మరియు మిస్ ఇండియా పోటీలకు కూడా వెళ్ళిన సంజన కామన్ పర్సన్ ఎలా అవుతుందని ఎక్కువ మంది ఫేస్ బుక్. ట్విట్టర్ ద్వారా ప్రశ్నించడం వలనే ఉన్నపళంగా ఆమెను తొలగించారని బిగ్ బాస్ టీం టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus