జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ భారత దేశ ప్రజలను విషాదంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో యువత పాక్ పై సర్జికల్ స్ట్రైకులు వంటివి చేసి.. ఇండియా పవర్ ఏంటో చూపించాలని కోరుతుంది. పర్యాటకులపై ఇప్పటివరకు ఉగ్రవాదులు దాడి చేయరు.. అవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగిపోయాయి అని అంతా భావించి.. పర్యాటకులు కాశ్మీర్ కి ఎక్కువ వెళ్తున్న తరుణంలో ఇలాంటి ఘోరమైన సంఘటన జరగడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
అందుకే పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఈ వేడి ప్రభాస్ ‘ఫౌజి’ సినిమాకి పాకినట్టు స్పష్టమవుతుంది. పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రభాస్ (Prabhas) ‘ఫౌజి’కి సంబంధం ఏంటి? అనుకుంటున్నారా? హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్విని (Imanvi) తీసుకున్నారు.
ఆమె పాకిస్థాన్ కి చెందిన అమ్మాయి.’ఇండియన్ సినిమాలో పాకిస్తాన్ అమ్మాయి హీరోయిన్ ఏంటి? వెంటనే ఆమెను సినిమా నుండి తీసేయండి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు.అయితే ఇమాన్వి (Imanvi) పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి, ముస్లిం అమ్మాయి అయినప్పటికీ ఆమె తండ్రి పాక్ మాజీ మిలిటరీ అధికారి. పైగా ఇప్పుడు ఇమాన్వి ఫ్యామిలీ విదేశాల్లో నివసిస్తుంది. పాకిస్తాన్ పై ఇండియా మొత్తం పగతో రగిలిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘ ‘ఫౌజి’ నుండి ఇమాన్విని (Imanvi) హీరోయిన్ గా తీసేయాలి’ అంటూ ఉడుకు రక్తంతో యువత కోరుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
అయితే పాకిస్తాన్లో అందరూ నెగిటివ్ గానే ఉంటారు అనడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని తెలుగు సినిమాల షూటింగ్లు ఇప్పటికీ పాకిస్తాన్లో జరుగుతున్నాయి అంటే అక్కడ కూడా ఎంతో కొంత మంచి లేకుండా సాధ్యం కాదు కదా. అప్పుడు ఇమాన్వి (Imanvi) లాంటి వాళ్లపై విరుచుకుపడటం అనేది అర్థం లేని ఆలోచనగా భావించాలి.