సునీల్ ని హెచ్చరిస్తున్న సినీ విశ్లేషకులు

సునీల్ హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకోవడానికి అతని టైమింగ్ తో పాటు ఆకారము తోడయింది. తనమీద తాను సెటైర్లు వేసుకుంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత హీరోగా మారిపోవడంతో స్థాయికి తగ్గట్టు ఫ్యామిలీ ప్యాక్ ని కాస్త సిక్స్ ప్యాక్ గా మార్చివేశారు. అయితే హీరోగా మొదట్లో విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత వరుసగా అపజయాలు పలకరించినప్పటికీ పాత రూటుకే వచ్చేసారు. హీరోయిజాన్ని పక్కన పెట్టి నవ్వించే రోల్ అందుకున్నారు. అలా అతను పూర్తి స్థాయి కామెడీ పాత్ర చేసిన

‘సిల్లీ ఫెలోస్‌’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఇందులో సునీల్ బాగానే న‌వ్వించాడు. కాక‌పోతే మ‌రీ లావైపోయాడనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. క‌నీసం క‌ద‌ల‌డానికి సైతం ఇబ్బంది పడడం బాగాలేదని చెప్పారు. మొదట్లో సునీల్ ఆకారం ముద్దుగా ఫ‌న్నీగా ఉండేది. హీరో అయ్యాక బాగా స‌న్న‌బ‌డిని సునీల్ మొహం పీక్కుపోయింది. ‘సునీల్ లావుగా ఉన్న‌ప్పుడే బాగున్నాడు’ అనే కామెంట్లు వినిపించాయి. అందుకోసం ఇప్పుడు మ‌ళ్లీ లావ‌య్యాడు. కానీ మోహంలో ఎక్స్ ప్రెషన్స్ కనిపించడం లేదని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం బరువు తగ్గాలని సూచిస్తున్నారు. లేకుంటే రీ ఎంట్రీ లో కమెడియన్ గా విజయం సాదించలేరని భావిస్తున్నారు. మరీ వారి సలహాని సునీల్ పాటిస్తారా? లేదా అనేది.. త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus