సంచలన నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు యువ హీరో మంచు మనోజ్‌ అభిమానులకు షాకిచ్చారు. బుధవారం సంచలన నిర్ణయం ప్రకటించి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు. సినిమాలో నటనకు స్వస్తి పలుకుతున్నట్లు ఫేస్‌బుక్‌ ద్వారా ఈ రోజు ఉదయం వెల్లడించారు. మనోజ్ నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కాకుండా ఆయన మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఇక ఎలాంటి సినిమాలూ ఒప్పుకోనని మనోజ్‌ ప్రకటించారు.

‘ఒక్కడు మిగిలాడు, మరో చిత్రంలో నటిస్తున్నాను. ఈ రెండే ఓ నటుడిగా నా ఆఖరి చిత్రాలు. అందరికీ ధన్యవాదాలు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అయితే మనోజ్‌ ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. మనోజ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ టీజర్ ఈరోజు సాయంత్రం 4 .15 గంటలకు రిలీజ్ కాబోతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus