మార్చి 11న హైద్రాబాద్ లో జరగనున్న దర్శకుల సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అగ్ర దర్శకులు, యువ దర్శకులు పదుల సంఖ్యలో పాల్గొని ప్యానెల్స్ ఫామ్ చేయగా.. ఈ ప్యానల్ లో ఒక బూటకపు ప్యానల్ కూడా ఉందని టాక్. 2012 – 2014లో వర్క్ చేసి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరరీలు కలిసి చిత్రపురి కాలనీలో 36 మంది అనర్హులైన వ్యక్తులకు దర్శకుల సంఘం కోటాలో ఫ్లాట్లు కేటాయించారు. ఆ కుతంత్రం బట్టబయలవ్వడంతో దర్శకుల పెద్దగా అందరూ భావించే దాసరి నారాయణరావుగారు ఆ ముగ్గిరినీ స్వయంగా ఏకంగా దర్శకుల సంఘం నుంచే గెంటివేయించారు.
ఇప్పుడు ఆ బృందం ఒక లాయర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ను ప్యానెల్ మెంబర్ గా నిలబెట్టి.. ఆయన వెనుక రాజకీయాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఈ బూటకపు దొంగ గ్యాంగ్ గురించి మొదట తెలియక రంగంలోకి దిగిన సదరు లాయర్, మొదట విత్ డ్రా చేసుకోవడానికి మొగ్గు చూపినప్పటికీ.. మళ్ళీ ఎక్కడ పరువు పోతుందేమోననే భయంతో వెనక్కి తగ్గడం లేదు. మరి ఈ పరువు పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.