Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇస్తున్న బిగ్ ట్విస్ట్ ఇదేనా ? ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.,?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం ఎలిమినేషన్స్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నామినేషన్స్ లో 8మంది ఉన్నారు. వాళ్లలో అశ్విని , ప్రియాంక, శోబా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉంటే, సందీప్, భోలే, అమర్ దీప్, శివాజీ ఇంకా గౌతమ్ లు మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ఒక్కసారి చూస్తే., శివాజీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. యావర్ – పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడా నామినేషన్స్ లో లేకపోవడం వల్ల శివాజీకి హ్యూజ్ గా ఓటింగ్ అనేది పడుతోంది.

వాళ్లిద్దరి ఓట్స్ కూడా శివాజీకే పడుతున్నాయి. అలాగే, భోలే శివాజీ గ్రూప్ లోకి రావడం వల్ల శివాజీ తరపునే ఉండటం వల్ల భోలేకి కూడా ఓటింగ్ బాగానే పడుతోంది. ఇక అమర్ దీప్ కూడా ఫస్ట్ నుంచీ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. అలాగే గౌతమ్, ప్రియాంకలకి కూడా ఓటింగ్ బాగానే వస్తోంది. ఎక్కడ అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూసినా కూడా సందీప్ ఇంకా శోభా ఇద్దరే బోటమ్ లో ఉన్నారు. వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కానీ, వీరిద్దరిలో ఎవరినీ ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ రెడీగా లేదు.

ఎందుకంటే, కంటెంట్ ప్రకారం చూసినా, గేమ్స్ ప్రకారం చూసినా ఇద్దరూ 100శాతం బిగ్ బాస్ మీద ప్రేమతో ఆడుతున్నారు. అలాగే టాస్క్ లలో లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నారు. శోభా అయితే ఏదో ఒక రూపంలో కంటెంట్ ఇస్తునే ఉంది. దీని ప్రకారం చూస్తే శివాజీ టీమ్ నుంచే ఒకరిని పంపించేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భోలే – ఇంకా అశ్విని ఇద్దరిలో ఒకరు వెళ్లిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే గనక జరిగితే ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది. ఇక ఈవారం బోలే షవాలిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

లాస్ట్ టైమ్ పూజతో పాటుగా భోలే లాస్ట్ వరకూ నామినేషన్స్ లోకి వచ్చాడు. అందరూ భోలే వెళ్లిపోతారనే అనుకున్నారు. కానీ భోలే ఎలిమినేషన్ గండాన్ని దాటాడు. అయితే, ఈసారి బిగ్ బాస్ టీమ్ కాల్ తీస్కుంటే అశ్విని లేదా భోలే ఇద్దరిలో ఒకరిని పంపించేస్తారు. లేదా ఈసారి నో ఎలిమినేషన్ కూాడ పెడతారు. అలా చేస్తే స్టార్ మా బ్యాచ్ ని సేవ్ చేయచ్చు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడనే అందరూ అంచనాలు వేస్తున్నారు. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus