Adipurush: ఆదిపురుష్ హనుమంతుని కండల సీక్రెట్ ఇదేనా?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ఎన్నో విమర్శలు వ్యక్తమైనా ఈ సినిమాలోని హనుమంతుని డైలాగ్స్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా హనుమంతుని పాత్ర పోషించిన దేవదత్త నాగె మాత్రం తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మరాఠీ నటుడైన దేవదత్త నాగె ఒకవైపు సినిమాలలో నటించడంతో పాటు ప్రముఖ సీరియళ్లలో సైతం మంచి పేరును సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం దేవదత్త నాగె వయస్సు 41 సంవత్సరాలు కాగా 2013 సంవత్సరంలో ఈ నటుడి కెరీర్ మొదలైంది.

వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారా మూవీతో ఈ నటుడి ప్రస్థానం మొదలైంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా దేవదత్త మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. హనుమంతునితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ ప్రముఖ నటుడు వెల్లడించారు. 17 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో తొలిసారి తాను జిమ్ కు వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. నేను వెళ్లిన ఆ జిమ్ పేరు హనుమాన్ వ్యాయామశాల అని దేవదత్త నాగె అన్నారు.

దేవుని ఆశీర్వాదం ఉండటం వల్లే ఆదిపురుష్ సినిమాలో ఈ పాత్ర పోషించే అదృష్టం నాకు దక్కిందని దేవదత్త నాగె వెల్లడించడం గమనార్హం. రోజూ భక్తిలో లీనమై ఆ పాత్రను పోషించానని ఆయన చెప్పుకొచ్చారు. రోజూ తగిన రీతిలో వ్యాయామం చేయడం వల్లే కండలు పెంచగలిగానని అదే నా కండల సీక్రెట్ అని దేవదత్త నాగె కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో దేవదత్తకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆదిపురుష్ (Adipurush) మూవీతో దేవదత్తకు మంచి గుర్తింపు రావడంతో ఇతర భాషల్లో కూడా ఈ నటుడికి ఆఫర్లు పెరుగుతాయేమో చూడాలి. రాబోయే రోజుల్లో ఈ నటుడికి మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus