టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు నటన కోసం తీవ్రంగా శ్రమించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రిస్కీ షాట్స్ లో కూడా తారక్ ధైర్యంగా పాల్గొంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న తారక్ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడంతో సోలో హీరోగా ఇండస్ట్రీ హిట్ సాధిస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. ఫ్లాపుల్లో ఉన్న ఎంతోమంది డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి ప్రశంసలు అందుకున్న తారక్ కొరటాల శివకు కూడా ఛాన్స్ ఇవ్వగా ఈసారి కూడా బ్లాక్ బస్టర్ ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా విడుదలైన వెంటనే వార్2, ప్రశాంత్ నీల్ సినిమాలతో తారక్ బిజీ కానుండగా ఈ రెండు సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని సమాచారం. తారక్ ఫ్యాన్స్ తారక్ భవిష్యత్తు సినిమాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే 2009 సంవత్సరం ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆర్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. 2009 సంవత్సరం మార్చి 26వ తేదీన ఖమ్మంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వెళ్లే సమయంలో యాక్సిడెంట్ జరిగింది.
అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కూడా తారక్ తన సినిమాల గురించే ఆలోచించారట. ముఖంపై గాయాలైతే అభిమానులు నిరాశ చెందుతారని ఫీలయ్యారట. ఒక సందర్భంలో తారక్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. మార్చి 26వ తేదీ లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కుడా కాగా ఒక సందర్భంలో తారక్ మాట్లాడుతూ యాక్సిడెంట్ తర్వాత జన్మను మరో జన్మగా భావిస్తానని మార్చి 26వ తేదీన రెండు పుట్టినరోజులు జరుపుకుంటామని అన్నారు.
ప్రతి మనిషి మరణానికి చేరువ కావాల్సిందేనని ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదని చనిపోయే ముందు క్షణం కూడా గిల్టీగా ఫీల్ కాకూడదని నేను భావిస్తానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!