Jr NTR: వార్2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ కు స్పూర్తి ఏంటంటే?

  • April 17, 2023 / 05:59 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వార్2 సినిమాలో కీలక పాత్ర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వార్2 మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ కాగా తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కృష్ణుని పాత్ర స్పూర్తితో ఎన్టీఆర్ రోల్ ను క్రియేట్ చేశారని సమాచారం అందుతోంది.

ఈ రోల్ అద్భుతంగా ఉండటంతో పాటు తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఆలోచనతో హృతిక్ పాత్ర అర్జునుడిని పోలి ఉంటుందని బోగట్టా. ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులలా మారితే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు హిందీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ హిందీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగేలా ప్లాన్ చేసుకుంటున్న తారక్ కు అభిమానుల నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో తారక్ ఒకరిగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కెరీర్ పరంగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరుకు ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఊరమాస్ పాత్రల కంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే పాత్రలపై ఎన్టీఆర్ దృష్టి పెడుతున్నారు. త్వరలో తారక్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. కెరీర్ పరంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus