కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరో ప్రభాస్ సపోర్ట్, టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుని వరుస ఆఫర్లతో ప్రభాస్ శ్రీను విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అలీతో సరదాగా షోలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు. కరోనా తర్వాత కొంత గ్యాప్ వచ్చిందని అందుకే ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. నాన్న నన్ను డాక్టర్ చేయాలని అనుకుంటే నేను యాక్టర్ అయ్యానని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.
సత్యానంద ఇన్స్టిట్యూట్ లో ప్రభాస్ తో పరిచయం ఏర్పడిందని ప్రభాస్ శ్రీను అన్నారు. ప్రస్తుతం నేను ప్రభాస్ కు సహాయకుడిగా ఉంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించానని నేను నటించిన సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడలేదని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. పారితోషికం విషయంలో కూడా ఎప్పుడూ డిమాండ్ చేయలేదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు.
ఇంట్లో ఎవరూ మాట్లాడకపోతే అక్వేరియంలోని చేపలతో మాట్లాడతానని ప్రభాస్ శ్రీను అన్నారు. మాది లవ్ మ్యారేజ్ అని ముందు నేను ప్రేమించానని తర్వాత నా భార్య ప్రేమించాల్సి వచ్చిందని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. ప్రభాస్ రాజుగారని నేను మంత్రి అని కృష్ణంరాజు గారు భావించేవారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. ఎవరైనా ఫోన్ కాల్ చేసి ఊరి పేరు చెప్పి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.
ఫోన్ కాల్ లో పేరు చెప్పకుండా ఊరి పేరు చెబితే నాకు కోపం వస్తుందని ప్రభాస్ శ్రీను అన్నారు. పాట పెట్టి డ్యాన్స్ చేయాలని చెబితే ఎంతసేపు అయినా చేస్తానని అలా కాకుండా అలా వేయాలి ఇలా వేయాలి అని చెబితే నేను డ్యాన్స్ వేయలేనని ప్రభాస్ శ్రీను అన్నారు. ఊరిలో సెకండ్ షో సినిమా చూడటానికి పక్క ఊరి వాళ్లు వచ్చేవాళ్లని వాళ్లను ఆపి డబ్బులు వసూలు చేసేవాడినని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.