Taraka Ratna: తారకరత్న ఆర్థికస్థితి విషయంలో అసలు వాస్తవాలు ఇవే!
- February 21, 2023 / 06:24 PM ISTByFilmy Focus
తారకరత్న మరణం తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వైరల్ అయిన వార్తలు నిజమేనా? అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తారకరత్న బాగానే ఆస్తులు కూడబెట్టారని ఆ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. తారకరత్న నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారని సమాచారం అందుతోంది.
ఏపీలోని క్వారీలలో కూడా తారకరత్న పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. తారకరత్నకు నాలుగు బ్లాక్ కార్ల కాన్వాయ్ కూడా ఉంది. తారకరత్నకు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదని బోగట్టా. ఆయనకు వారసత్వంగా కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయని సమాచారం అందుతోంది. తారకరత్నకు ఎంతో మంచి భవిష్యత్తు ఉండగా పలు స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వచ్చిన సమయంలోనే గుండెపోటు వల్ల ఆయన మృతి చెందారు. తారకరత్నకు నందమూరి కుటుంబంలో అందరి సపోర్ట్ ఉండేదని సమాచారం అందుతోంది.

తారకరత్నకు వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన మంచితనం గురించి ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. నటించిన సినిమాలు సక్సెస్ సాధించి ఉంటే తారకరత్న మరో స్థాయిలో ఉండేవారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తారకరత్న తన సినిమాలు సక్సెస్ కాకపోవడం వల్ల బాధ పడ్డారని తెలుస్తోంది. తారకరత్నను అభిమానించే ఫ్యాన్స్ ఆయన మరణవార్తను విని తట్టుకోలేకపోతున్నారు.

తారకరత్న కుటుంబానికి అండగా నిలుస్తున్న బాలయ్యను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తారకరత్న నటించిన చివరి సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. రేపు తారకరత్న పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. పుట్టినరోజుకు మూడు రోజుల ముందు తారకరత్న మృతి చెందడం గమనార్హం.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?












