టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో గీతా ఆర్ట్స్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. నాన్న అల్లు రామలింగయ్య గీతా ఆర్ట్స్ పేరు పెట్టారని అల్లు అరవింద్ తెలిపారు. భగవద్గీత సారాంశం నచ్చడం వల్ల నాన్న ఆ పేరు పెట్టడం జరిగిందని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు. ప్రయత్నం మాత్రమే మనదని ఫలితం మన చేతిలో ఉండదని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
సినిమాలకు ఇది సరిగ్గా సరిపోతుందని గీతా ఆర్ట్స్ అనే పేరును నాన్న పెట్టారని అల్లు అరవింద్ అన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తీసిన సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీ ఆడాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాలేజ్ లో చదువుకునే సమయంలో నాకు గీత పేరుతో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు. దేవి థియేటర్ దగ్గర ఒక వ్యక్తి చిరంజీవి గురించి అమర్యాదగా మాట్లాడటంతో అతనిని కొట్టగా ఆ వ్యక్తికి 13 కుట్లు పడ్డాయని అల్లు అరవింద్ తెలిపారు.
నా బ్యానర్ లో నటించిన నాన్న, చిరంజీవి, బన్నీలకు రెమ్యునరేషన్ ఇచ్చానని అల్లు అరవింద్ అన్నారు. మేము అనుకున్న దానికంటే భారీగా ఖర్చు చేసిన మూవీ మగధీర అని ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 80 శాతం ఎక్కువ ఖర్చైంది అని అల్లు అరవింద్ తెలిపారు. బన్నీ ఏ పని చేసినా తపన, ఏకాగ్రతతో చేస్తాడని అల్లు అరవింద్ అన్నారు. నాన్న రెండుసార్లు జైలుకు వెళ్లాడని అల్లు అరవింద్ తెలిపారు.
మా తాతగారి దగ్గర 20 ఎకరాలు ఉండేదని మా నాన్నకు అందులో వాటాగా 4 ఎకరాలు వచ్చిందని అల్లు అరవింద్ పేర్కొన్నారు. మహేష్, తారక్, చరణ్, బన్నీ అందరూ మంచి ఫ్రెండ్స్ అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. మా నాన్నకు అల్లు అనే పేరు చాలా ఇష్టమని ఆయన మనవాళ్లు ఆ పేరును మరింత పైకి తీసుకెళతారని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!