సిల్క్ స్మిత మరణానికి అసలు కారణమదేనంటున్న స్టార్ హీరో..!

ఒక్కప్పుడు తన గ్లామర్ తో సౌత్ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. ఐటెం గర్ల్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. మెల్లగా సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది ఈ బ్యూటీ. ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే… కొన్ని పరిస్థితుల వల్ల అమాంతం కిందకి పడిపోయిందని కొందరు చెబుతుంటారు. ఇక అదే క్రమంలో సూసైడ్ చేసుకుని చనిపోయింది కూడా. ఈమె జీవిత చరిత్రని ఆధారం చేసుకుని ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రం పెద్ద విజయం కూడా సాధించింది. అయితే ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో ఎంతవరకూ నిజముందనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు.

అయితే ఈమె మరణం వెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాల్ని బయటపెట్టాడు ఓ స్టార్ హీరో. కన్నడ సూపర్ స్టార్ అయిన రవిచంద్రన్.. సిల్క్ స్మితకు మంచి స్నేహితుడు కూడా..! 1992లో వీళ్ళిద్దరూ కలిసి ‘హల్లి మేస్త్రు’ అనే చిత్రంలో నటించారు. అప్పటినుండీ వీరికి మంచి స్నేహం ఉందట. ఇక సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు… రవిచంద్రన్ కు ఫోన్ చేసిందట. ‘నన్ను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. కుదర్లేదు’ అంటూ ఈయన తెలిపాడు. ‘నేను ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో… ‘క్యాజువల్ కాల్’ అనుకుని లిఫ్ట్ చేయలేదు. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత నుండీ నాకు ఫోన్ వచ్చింది. కానీ మాట్లాడలేకపోయాను. ఆ తర్వాతి రోజే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆరోజు నేను ఫోన్ లిఫ్ట్ చేసుంటే.. ఈరోజు వేరే విధంగా ఉండేదేమో” అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus