Suriya: కెరీర్ తొలినాళ్లలో సూర్యకు ఎదురైన అవమానాలు ఏంటో తెలుసా?

టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖ హీరోలలో సూర్య ఒకరు కాగా సూర్య సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. హీరో సూర్య వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. సూర్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అయితే సూర్య తాజాగా ఒక సందర్భంలో కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. సూర్య అసలు పేరు శరవణన్ కాగా డైరెక్టర్ మణిరత్నం శరవణన్ పేరు సూర్యగా మార్చారు.

సూర్య (Suriya) తొలి మూవీ నేరుక్కు నేర్ కాగా ఈ సినిమాలోని తొలి షాట్ కు మణిరత్నం దర్శకత్వం వహించడం గమనార్హం. సూర్య తండ్రి శివకుమార్ అప్పట్లో హీరో కాగా సూర్యకు మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాలేజ్ లో ఒక సందర్భంలో సూర్య బీకామ్ కు బదులుగా డూకామ్ అని చెప్పారు. ఆ ఘటన వల్ల స్టేజ్ ఫియర్ తో సూర్య సినిమాల్లోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. సూర్య కెరీర్ తొలినాళ్లలో గార్మెంట్ కంపెనీలో పని చేసి రెండు నెలలకు 1200 రూపాయలు అందుకున్నారు.

ప్రముఖ నటుడు రఘువరన్ సూర్యలో మార్పుకు కారణమయ్యారు. ఒకసారి రఘువరన్, సూర్య కలిసి రైలులో ప్రయాణం చేస్తుండగా రైలులో నిద్రపోయిన సూర్యను లేపి “ఎలా నిద్రపడుతోందిరా నీకు? ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో బ్రతుకుతావ్” అని కామెంట్ చేశారు. ఆ మాటలకు బాధ పడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టి నటుడిగా ఇంప్రూవ్ అయ్యారు.

ఒక సినిమా షూటింగ్ సమయంలో జ్యోతిక మీ కళ్లు చాలా బాగుంటాయని చెప్పడంతో సూర్య ఎంతగానో సంతోషించారు. సూర్య, జ్యోతిక పలు సినిమాలలో కలిసి నటించగా ఆ సినిమాలు సక్సెస్ సాధించాయి. పలు సినిమాలకు సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. సూర్యకు రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus