‘రాధేశ్యామ్’… ప్రభాస్ ఈ పేరును గత కొన్ని నెలలుగా జపిస్తూనే ఉన్నారు. ఇదిగో సినిమా అంటూ కొన్ని రోజులు, అయ్యో వాయిదా అంటూ ఇంకొన్ని రోజులు, రెడీ ఇంకా వచ్చేస్తున్నాం అని మరికొన్ని రోజులు సినిమా ఫ్యాన్స్ నోళ్లో, మీడియాలో నానుతూనే ఉంది. తాజాగా డేట్ ప్రకారం అయితే సినిమాను మార్చి 11న విడుదల చేయాలి. ఈ సమయంలో ఫ్యాన్స్‌కు ఇబ్బంది పెట్టే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ… వార్త అయితే పక్కాగా చిరాకు పెట్టేదే.
‘రాధేశ్యామ్’ సినిమా ఫుటేజ్‌ను మరోసారి ఎడిటింగ్ టేబుల్ మీదకు ఎక్కించారని టాక్. అవును సినిమా అవుట్‌పుట్ మీద ఉన్న చిన్న చిన్న డౌట్స్‌ను ఫిక్స్ చేసుకోవడానికి ఎడిటింగ్ టీమ్ మరోసారి కత్తెర పట్టుకుందని సమాచారం. అంతా ఓకే ప్రచారం షురూ చేసేస్తారు అనుకున్న సమయంలో మళ్లీ ఎడిటింగ్ అనేసరికి ఫ్యాన్స్ షాక్ అవుతారు కదా. సినిమా అక్కడక్కడా డ్రైగా ఉందని, ల్యాగ్ లా ఉందని ఫీడ్ బ్యాక్ వచ్చిన పార్టులను ట్రిమ్ చేసే పనిలో ఉన్నారట.
సినిమా నిడివి విషయంలో ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతెందుకు సినిమా ట్రైలర్ నిడివి, ఫుటేజ్ విషయంలోనే పెదవివిరుపులు వినిపించాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేయాలని అనుకున్న నేపథ్యంలో చిత్రబృందం అప్పుడు ఏం చేయలేక ఆగిపోయింది. కానీ ఇప్పుడు టైమ్ ఉంది కాబట్టి మరోసారి ఎడిట్ మొదటుపెట్టి సినిమాను క్రిస్ప్ చేద్దామని సిద్ధమయ్యారట. ఇప్పటికే దీనికి సంబంధించి పని చివరి దశకు వచ్చిందని కూడా అంటున్నారు. ఇటీవల సినిమాను స్పెషల్ షో వేసి చిత్రబృందం కొంతమంది సన్నిహితులకు చూపించిందట.
ఈ క్రమంలో వారి నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకొని సినిమాను ఎడిట్ రూమ్‌కి మళ్లీ తీసుకెళ్లారని అంటున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. డెస్టినీతో పోరాడే ప్రేమకథగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. మరి సినిమా డెస్టినీ ఏంటనేది మార్చి 11న తేలుతుంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!