షాకిస్తున్న తేజు ‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

సాయి ధరమ్ తేజ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్.. నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. అయితే తేజు గత చిత్రాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ అంతగా జరగదేమో అని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ.. ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 15 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… తేజు గత ఆరు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. కనీసం 10 కోట్లు కూడా షేర్ సాధించని చిత్రాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇక దర్శకుడు కిశోర్ తిరుమల గత చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ కూడా ప్లాప్ గా నిలిచింది. ఇక ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ గత చిత్రాలు ‘సవ్యసాచి’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలు డిజాస్టర్లు గా మిగలడమే కాదు.. కనీసం 10 కోట్ల షేర్ ని కూడా రాబట్టలేకపోయాయి. ఈ దశలో ‘చిత్రలహరి’ చిత్రానికి 10 కోట్లు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి 15 కోట్ల ప్రీ రిలీజ్ జరగడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక ఈ చిత్రంతో అయినా తేజు హిట్టు సాధిస్తాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus