హాట్ టాపిక్ అయిన ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పారితోషికం!

ఫలానా హీరోయిన్ ఒక్క సాంగ్ కి అరకోటి తీసుకుందంట.., రెండు హిట్స్ రాగానే ఈ బ్యూటీ కోటి అడుగుతుందంట… అనే మాటలు విన్న చెవులకు కొత్తగా “ఆమెకి అంతే ఇచ్చారా?” అనే మాట వినిపిస్తోంది. ఆమె ఎవరు? ఎంత ఇచ్చారు? అని వివరాల్లోకి వెళితే… కార్తికేయ హీరోగా యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా ఆర్ ఎక్స్ 100 . గురువారం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. రెండు రోజుల్లోనే 2.53 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. కొత్త డైరక్టర్, కొత్త హీరో సినిమాకి వస్తున్న కలక్షన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతానున్నారు. మౌత్ టాక్ ద్వారా ఈ సినిమాకి కలక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని సమాచారం.

ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె బోల్డ్ గా నటించి.. యువతని మళ్ళీ మళ్ళీ థియేటర్ కి రప్పించేలా చేస్తోంది. హిందీ టీవీ సీరియల్ ద్వారా అందరికీ తెలిసిన పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రంలో అనేక ముద్దులు పెట్టేసింది. సిగ్గుని బీరువాలో పెట్టి.. ఆడియన్స్ కి కనులవిందు చేసింది. దీంతో ఆమెకు బలంగానే రెమ్యునరేషన్ ముట్టచెప్పి ఉంటారని అనుకున్నారు. ఎంతో తెలుసుకుందామని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఆరు లక్షలు మాత్రమే పాయల్  అందుకున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అంత కష్టపడినా ఆమెకు అంతేనా ఇచ్చేది అని చర్చించుకోవడంతో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకి తక్కువ తీసుకున్నప్పటికీ తర్వాత సినిమాలకు ఎక్కువ అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus