సుమ విడాకుల వార్తల్లో నిజమెంత…?

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ ఉంటూ … మన తెలుగమ్మాయే అనేలా మాయ చేసింది యాంకర్ సుమ. ఇప్పుడు బుల్లితెర పై ఈమెనే నెంబర్ వన్ యాంకర్. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి గ్లామర్ వడ్డించే యాంకర్ లు వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సుమకే ఓటేస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. సినిమాల ఈవెన్ట్ లకు కూడా సుమనే కావాలి. ఆమె ఉంటే ఈవెన్ట్ కి కళ అని అందరూ భావిస్తారు.

ఇంతలా ప్రతీ ఒక్కరి కుటుంబంలో ఓ సభ్యురాలు అయిపోయిన సుమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల పై కూడా అందరికీ ఎంతో ఆశక్తి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు రావడం పెద్ద చర్చకు దారి తీసింది. తన భర్త రాజీవ్ కనకాలతో సుమకు ఈ మధ్య అస్సలు పడటం లేదని.. సుమ సంపాదన గురించిన విషయాల్లో రాజీవ్ అస్సలు ఓర్వలేకపోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలే వీరి కుటుంబంలో వరుస విషాదాలు నెలకొన్న నేపధ్యంలో ఈ వార్తలు పుండు మీద కారం జల్లినట్టే ఉంటాయి అని చెప్పాలి. రాజీవ్ కనకాల తల్లిదండ్రులతో పాటు ఆయిన సోదరి కూడా ఇటీవల మరణించింది. కాబట్టి వారు ఎంతో బాధలో ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీరు యాక్టివ్ గా ఉండడం లేదు. మరి ఇలా విడాకులు అంటూ వార్తలు రావడం పై .. వారు స్పందిస్తే కానీ క్లారిటీ రాదనే చెప్పాలి.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus