పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డి.వి.వి.దానయ్య భారీ పారితోషికం ఆఫర్ చేసి ఓ సినిమాకి సైన్ చేయించుకున్నారు. ఈ ప్రాజెక్టుకి మారుతీ దర్శకుడు. ఇక్కడి వరకు నిజమే కానీ.. దీనికి టైటిల్ ‘రాజా డీలక్స్’ అని ఫిక్స్ చేసారని, తర్వాత అది ప్రభాస్ కు నచ్చకపోవడంతో టైటిల్ మారుస్తున్నారని, ఇది ఒక హార్రర్ నేపథ్యంలో సాగే కథ అని ప్రచారం మొదలైంది. అంతే కాదు ప్రభాస్ ఈ మూవీ కోసం దానయ్య వద్ద నుండీ ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం ఆఫర్ అందుకున్నట్టు కూడా చర్చ నడుస్తుంది.
ప్రస్తుతానికైతే వీటిలో ఏది నిజం కాదు అని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ తో మారుతీ చేస్తుంది హార్రర్ జోనర్ మూవీ కాదు పక్కా మాస్ మసాలా మూవీ. ఇందులో ఎంటర్టైన్మెంట్ కు కూడా పెద్ద పీట వేయబోతున్నాడు మారుతీ. అంతేకాదు ఈ మూవీ కోసం దానయ్య.. ప్రభాస్ కు ఆఫర్ చేసింది రూ.50 కోట్లు కాదు అక్షరాలా రూ.75 కోట్లు. 60 రోజుల వరకు ప్రభాస్ కాల్ షీట్లు ఇవ్వడం జరిగిపోయింది.
ఉగాది నుండీ షూటింగ్ లేదా పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 2022 లోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘సలార్’ షూటింగ్ కు ప్రభాస్ త్వరలోనే గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కు సంబంధించి ప్రభాస్ తన పార్ట్ ను కంప్లీట్ చేయడం జరిగింది. డబ్బింగ్ చెప్పుకోవడం బ్యాలన్స్ ఉంది. ‘సలార్’ కంప్లీట్ అయితే మారుతీ సినిమా ఫుల్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సలార్ కూడా ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘రాధే శ్యామ్’ రిజల్ట్ తో ప్రభాస్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. అర్జెంటుగా వాళ్ళని శాటిస్ఫై చేసే హిట్ ఇవ్వాలి ప్రభాస్. అందుకోసం మారుతీ సినిమాని సాధ్యమైనంత త్వరలో కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. అప్పుడే రూ.5 కోట్లతో భారీ సెట్ కూడా ఈ మూవీ కోసం వేయడం జరిగింది.