Jr NTR: ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి బ్రేక్ పడిందా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో రెండు నెలల్లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కానుండగా ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే నిన్నటి నుంచి ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఉగాది పండుగకు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలు నమ్మేలా లేకపోయినా ఈ ప్రచారం వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎన్టీఆర్ లేదా త్రివిక్రమ్ స్పందించి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పష్టతనిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని త్వరలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొంతమంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు వచ్చే ఏడాది జనవరి వరకు సర్కారు వారి పాట షూటింగ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

అందువల్ల మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు లేవని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించడంతో పాటు ఆ సినిమాలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ కొత్తగా చూపించారని ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్ లేదా త్రివిక్రమ్ త్వరగా స్పందించి వైరల్ అవుతున్న గాసిప్స్ కు చెక్ పెడతారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus