హీరోయిన్ ని హీరో ఎప్పుడూ మోసం చేయడు.. అలా తెరపైన నయనతారని ఏ హీరో మోసం చేయలేదు. నిజ జీవితంలో మాత్రం ఇద్దరు హీరోలు ఆమెను మోసం చేశారు. తప్పు ఎవరివైపు ఉన్నదో తెలియదు కానీ.. శింబు, ప్రభుదేవాలు నయన జీవితంలోకి వచ్చి.. జీవితాంతం తోడుంటామని చెప్పి మధ్యలోనే చేతిని వదిలేశారు. ఆ బాధ నుంచి తేరుకొని నయనతార సినిమాల్లో బిజీ అయింది. దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్ అయింది. ఎవరైనా ప్రేమకి బానిసే అనే విధంగా ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ ప్రేమలో పడింది. యువ డైరక్టర్ విగ్నేష్ ని ఘాడంగా ప్రేమించింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ప్రేమ యాత్రలు చేస్తున్నారు. నయనతార బర్త్‌డేని విగ్నేష్ న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసాడు. విగ్నేష్ బర్త్‌డే ని నయనతార అమృత్సర్ లో సెలబ్రేట్ చేసింది.
ఇలా వారు విహరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు.. ప్రేమ యాత్రలు బాగానే ఉన్నాయి.. పెళ్లి ఎప్పుడని ? విఘ్నేష్ ని అడిగితే షాక్ అయ్యే సమాధానం ఇచ్చాడు. “పెళ్లి విషయం నాకు తెలియదు. ముందు నయన్ ను అడగాలి. ఆ తర్వాత మా అమ్మ అనుమతి కూడా తీసుకోవాలి. అప్పుడు పెళ్లి గురించి మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను” అని విగ్నేష్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతని కామెంట్స్ చూస్తే నయనని పెళ్లి చేసుకునేటట్టు లేడని నెటిజనులు సందేహాన్ని వ్యక్తం చేసారు. అందరూ అనుమానిస్తునట్టు జరిగితే నయనతార కోలుకోవడం కష్టమవుతుందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.